Site icon HashtagU Telugu

iPhones – Urgent Update : ఐఫోన్ యూజర్స్ కు అర్జెంట్ అప్ డేట్.. బీ అలర్ట్ !

New Iphones

New Iphones

iPhones – Urgent Update :  మీరు యాపిల్ ఐఫోన్ వాడుతున్నారా ? అయితే బీ అలర్ట్. వెంటనే మీరొక సెక్యూరిటీ అప్ డేట్ చేసుకోవాలి. ‘పెగాసస్‌ ’ అనే నిఘా సాఫ్ట్‌వేర్‌ను ఐఫోన్లలోకి చొప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో యాపిల్ అలర్ట్ అయింది. తమ యూజర్స్ సేఫ్టీ కోసం ఎమర్జెన్సీ సెక్యూరిటీ అప్‌డేట్‌ ను రిలీజ్ చేసింది. ఈ అప్ డేట్ చేసుకుంటే హ్యాకర్ల బారి నుంచి ఐఫోన్లను కాపాడుకోవచ్చని సూచించింది. ‘సిటిజన్‌ ల్యాబ్‌’ అనే ఇంటర్నెట్‌ వాచ్‌డాగ్‌ ఐఫోన్‌ సాఫ్ట్‌వేర్‌లోని కొన్నిలోపాలను గుర్తించి,  యాపిల్‌ ను అలర్ట్ చేసింది.

Also read : Why Pawan Kalyan Silent : పవన్ సైలెంట్ అయిపోయాడేంటి..?

అమెరికాలోని వాషింగ్టన్‌ కు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌లోకి ‘పెగాసస్‌ ’ అనే నిఘా సాఫ్ట్‌వేర్‌ను చొప్పించే ప్రయత్నం జరిగిందని తమ రీసెర్చ్ లో వెల్లడైందని  సిటిజన్‌ ల్యాబ్‌ తెలిపింది. ఐఫోన్ యూజర్ ఏమీ చేయకుండానే .. ఆటోమేటిక్ గా ఫోన్ లోకి పెగాసస్ సాఫ్ట్ వేర్ ఇన్‌స్టాల్‌ అయ్యేలా చేేసేందుకు హ్యాకర్లు విఫల యత్నం  చేశారని  పేర్కొంది. ఈ నిఘా సాఫ్ట్ వేర్ ఐఫోన్ లోకి చొరబడితే.. యూజర్‌ ప్రమేయం లేకుండానే కెమెరా ఆన్‌ కావడం, వాయిస్‌ రికార్డ్ కావడం వంటివన్నీ  జరుగుతాయని హెచ్చరించింది. ఐఫోన్ లలోని కొన్ని లోపాలను వాడుకొని కొందరు హ్యాకర్లు ఈవిధంగా ఫోన్లలోకి పెగాసస్ స్పైవేర్ ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని (iPhones – Urgent Update) టెక్ నిపుణులు అంటున్నారు. కాగా, గతంలో భారత్‌లో రాజకీయ నాయకులు, ప్రముఖులపై నిఘా కోసం కేంద్ర ప్రభుత్వమే పెగాసస్‌  సాఫ్ట్ వేర్ ను  కొనుగోలు చేసిందని పెద్దఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే.