భారీగా తగ్గిన Apple iPhone SE స్మార్ట్ ఫోన్ ధర.!! ఎంతంటే.!!

ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్. ఇప్పుడు సరసమైన ధరకే ఆపిల్ ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది.

  • Written By:
  • Updated On - March 2, 2022 / 01:17 PM IST

Apple iPhone SE: ఐఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్. ఇప్పుడు సరసమైన ధరకే ఆపిల్ ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. Apple iPhone SE స్మార్ట్ ఫోన్‌ను రూ. 15,499నుంచి కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఇ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్ Apple iPhone SEని 24 శాతం తగ్గింపు ధరకు అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 39, 900 కాగా ప్రస్తుతం రూ. 30, 299కి విక్రయిస్తోంది. మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసినట్లయితే దాదాపు 50 శాతం తగ్గింపు ధరను కూడా అందిస్తోంది. ఈ ఎక్స్‌ఛేంజ్ విలువు రూ. 14,800 వరకు ఉండే అవకాశం ఉంది. దీంతో Apple iPhone SE స్మార్ట్ ఫోన్ ధర రూ. 15,499కి తగ్గుతుందన్న మాట.

Apple iPhone SE స్మార్ట్ ఫోన్ స్పెఫికేషన్స్ చూసినట్లయితే ఇందులో 4.7 అంగుళాల డిస్ ప్లే…12మెగాపిక్సెల్ కెమెరా…సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 7మెగాపిక్సెల్ తో సెల్ఫీ లెన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ A13 బయోనిక్ చిప్ సెట్ ను కూడా కలిగి ఉంది.

Apple iPhone SE ధర… iPhone SE3 2022 మోడల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ తర్వాత మరింత తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. APPLE మార్చి నెలలో కొత్త iPhone SE 2022ను లాంచ్ చేస్తుందని టెక్ ప్రియులు అంచనా వేస్తున్నారు. 2022లో ఐఫోన్ ఎస్ ఈ స్మార్ట్ ఫోన్ కొత్త ఫీచర్ల గురించి కొన్ని లీక్స్ బయటకు వచ్చాయి. మొదటిసారిగా ఈ ఐఫోన్ ఎస్ ఈ 2022లో 5G సపోర్టుతో మెరుగైన బ్యాటరీ లైఫ్ ను అందించనుంది.

Apple iPhone SE 2022 స్మార్ట్ ఫోన్లో ఉన్న సెల్ఫీ లెన్స్ ప్రస్తుతం ఐఫోన్ 13 సిరీస్ లో ఉపయోగిస్తున్న A15 బయోనిక్ చిప్ సెట్ ను అందిస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Apple iPhone SE 3 2022 ఈ నెలలో ఎప్పుడైనా లాంచ్ కావచ్చు. Apple iPhone SE 3 2022 డిజైన్ లో కొన్ని మార్పులు చేయవచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఈ ఎడిషన్ ఫోన్ ధర కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.