జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. మూడు పెళ్లిళ్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఏపీ మహిళా కమిషన్ కోరింది. భరణమిస్తే భార్యను వదిలించుకోవచ్చనే సందేశమిచ్చేలా పవన్ కల్యాణ్ మాటలున్నాయని పేర్కొంది. ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఉంటుందా అని ప్రశ్నించింది. మహిళలను ఉద్దేశించి స్టెపినీ అనే పదం పవన్ కల్యాణ్ ఉపయోగించడం ఆక్షేపణీయం అని పేర్కొంది. చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలను పవన్ వెనక్కి తీసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. మహిళా లోకానికి పవన్ కల్యాణ్ తక్షణం క్షమాపణ చెప్పాలని ఏపీ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు.. కారణం ఇదే..?

Pawan