Site icon HashtagU Telugu

AP DGP : డీజీపీని క‌లిసిన మ‌హిళా క‌మిష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్‌.. సీఎం జ‌గ‌న్ సతీమ‌ణిపై వాఖ్య‌లు చేసిన వారిపై..?

Ap Dgp7788

Ap Dgp7788

ఏపీ డీజీపీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డిని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ క‌లిశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి పై సోషల్ మీడియా లో ఉద్దేశ పూర్వకంగా వాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి సతీమణి భారతి గత ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలు వక్రీకరించి ఒక వర్గం సోషల్ మీడియా లో చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన ఆధారాలు ను డీజీపీ కి అందించారు. మహిళలు ను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేయటం తగదని ఆమె తెలిపారు. లిక్కర్ మాఫియా లో భారతి పై నిరాధారమైన ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి ని మానసికంగా కుంగతీయాలనే ఆలోచనలో టీడీపీ నాయకులు ఉన్నారని వాసిరెడ్డి ప‌ద్మ ఆరోపించారు.

Exit mobile version