Site icon HashtagU Telugu

PRC: పీఆర్సీపై మీడియా ఎదుట గొల్లుమ‌న్న ఉద్యోగ నేత‌లు

Jagan Victory

Jagan AP employees

విజ‌య‌వాడ ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేత‌లు అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. ఏపీ ప్ర‌భుత్వం సోమ‌వారం రాత్రి పీఆర్సీ అమ‌లు, డీఏ బ‌కాయిలు చెల్లించాల‌ని జీవోలు విడుదల చేసింది. అయితే ఈ జీవోల‌పై ఉద్యోగ సంఘాల నేత‌లు మండిప‌డుతున్నారు. ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ప్రభుత్వం పీఆర్సీ 23శాతం , ఇతర డిఎలు ఇస్తామ‌ని సీఎం తెలిపార‌ని .. ఇతర అంశాలను సి.యస్ తో మాట్లాడాలని సూచించార‌ని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్య‌క్షుడు బండి శ్రీనివాస‌రావు తెలిపారు. అయితే ఐ.ఆర్ కన్నా తక్కువ వేతనాలు త‌మ‌కు బాధ కలిగించిందని.. హెచ్.ఆర్.ఎ ను తొలగించి కేంద్రం స్కీం అని మార్చారని ఆయ‌న ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జీవోలు త‌మ‌కు వ‌ద్ద‌ని ఈ పీఆర్సీని వ్యతిరేకిస్తున్నామ‌ని బండి శ్రీనివాస‌రావు తెలిపారు. త‌మ హక్కుల ను దెబ్బ తీసేలా జగన్ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని.. గతంలో మేము పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తారా అని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.
గ్రాడ్యుడిటీ 16లక్షల సీలింగ్ ఎత్తి వేయడం చాలా దుర్మార్గమ‌ని.. మాస్టర్ స్కేల్స్ ను మార్చి పదేళ్లకు ఇచ్చే పీఆర్సీ త‌మ‌కొద్ద‌ని తేల్చి చెప్పారు. ఐదేళ్లకు పీఆర్సీ ఇచ్చేలా పోరాడి సాధిస్తామ‌ని.. ఐదు డీఏ లు పెంచామని చెప్పి… ఇతర వాటిలో కోత విధించడం అన్యాయంమ‌ని ..సీఎం అడగకుండానే ఇచ్చారంటూ ఇప్పుడు కోత విధించడం ఏంట‌ని బండి శ్రీనివాస‌రావు ప్ర‌శ్నించారు. రేపు, ఎల్లుండి సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామ‌ని ..నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వం తీరును ఎండగట్టాలని ఉద్యోగుల‌కు పిలుపునిచ్చారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పడతామ‌ని హెచ్చ‌రించారు. ఏపీ జేఏసీ అమ‌రావ‌తి నేత బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ 11వ పిఆర్సీకి సంబంధించి అశాస్త్రీయంగా ఇచ్చిన జీవోల‌ను వ్యతిరేకిస్తున్నామ‌ని తెలిపారు. నిన్నటి రోజును ఉద్యోగులు, ఉపాధ్యాయలకు చీకటి దినంగా భావిస్తున్నామ‌ని.. సిఎం ఫిట్ మెంట్ ప్రకటించి, సియస్ తో ఇతర అంశాలు మాట్లాడాలని చెప్పి వెళ్లిపోయారన్నారు. ఈ కొత్త మెలికలు లేకుండా మిశ్రా ప్రతిపాదనలు అమలు చేయాలి కానీ అధికారుల కమిటీ చెప్పిన విధంగా ప్రభుత్వం నిర్ణయం చేయడం అన్యాయమ‌ని బొప్ప‌రాజు అన్నారు.