AP Police: ఏపీలో గ్రామానికో మహిళ పోలీస్

రాష్ట్రం లోని ప్రతి గ్రామానికి, ప్రతి వార్డు కు ఒక మహిళను పోలీసు ప్రతినిధిగా అందుబాటులోకి తీసుకొస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Updated On - January 12, 2022 / 10:30 PM IST

రాష్ట్రం లోని ప్రతి గ్రామానికి, ప్రతి వార్డు కు ఒక మహిళను పోలీసు ప్రతినిధిగా అందుబాటులోకి తీసుకొస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
మహిళా పోలీసు వ్యవస్థ ను పటిష్ట పరిచేలా ఉత్తర్వులు ఇచ్చింది.
గ్రామ వార్డ్ సచివాలయాలలో ఉపయోగించుకొనేలా మార్గదర్శికాలను సూచించింది. పోలీసు శాఖకు అనుసంధానంగా మహిళా పోలీస్ వ్యవస్థ ఉంటుంది.
ఇకనుండి జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో నేరుగా మహిళా పోలీసులు విధులు నిర్వహించనున్నారు.
‘యూనిఫామ్ అనేది ఒక గౌరవం. సగర్వంగా యూనిఫామ్ ధరించండి. ప్రజా సేవలో పునరంకితమవ్వండి. మహిళా పోలీసులకు పోలీస్ శాఖలో తగిన గౌరవం ఉంటుంది..’అంటూ – డీజీపీ గౌతమ్ సవాంగ్ హామీ ఇచ్చాడు.
పోలీసు శాఖలోని పదోన్నతుల తో సంబంధం లేకుండా మహిళా పోలీసుల కోసం ప్రత్యేకంగా పదోన్నతులు కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మహిళా పోలీసులకు పదోన్నతుల కోసం ప్రత్యేకంగా సీనియర్ మహిళా పోలీస్, ASI, ఎస్‌ఐ,ఇన్స్పెక్టర్ (మహిళా పోలీస్) పోస్టులను సృష్టించారు. మహిళా పోలీసులు 24×7 గంటలు పని చెయ్యాల్సిన అవసరం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశాడు.
నాలుగు నెలల శిక్షణలో భాగంగా మొదట మూడు నెలలు పోలీస్ కళాశాల శిక్షణ, మరో నెల రోజుల పాటు క్షేత్రస్థాయి శిక్షణ మహిళ పోలీస్ కి ఇవ్వనున్నారు. సమాజంలో మెరుగైన పౌర సేవలు అందించటానికి ఏర్పడిన మహిళ పోలీసు వ్యవస్థ ను సమర్థవంతంగా, ఆదర్శనీయంగా తీర్చిదిడా నికి ప్రణాళిక తయారు చేశారు.సామాన్యులకు మెరుగైన సేవలు అందిస్తూనే, మహిళలు, చిన్నారులు, అట్టడుగు రక్షణ ధ్యేయంగా మహిళా పోలీస్ వ్యవస్థను ఒక అద్భుతమైన వ్యవస్థగా తీర్చి దిద్దుతామని డీజీపీ వెల్లడించాడు.