Site icon HashtagU Telugu

10th Results : నేడు ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌

CBSE Guidelines

CBSE Guidelines

నేడు ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేయ‌నున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు రానున్నాయి. నిన్న ఫ‌లితాలు విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. అధికారులు, మంత్రి, సి‌ఎం‌వోల సమన్వయ లోపంతో వాయిదా పడ్డాయి. ఫలితాలు వాయిదా పడడంతో విద్యార్థులు,తల్లిదండ్రులు నిరాశకు లోనయ్యారు. క‌రోనా కార‌ణంగా గ‌త రెండెళ్లుగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేదు. రెండేళ్ల తర్వాత ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించ‌గా..వాటి ఫ‌లితాలు విడుద‌ల చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. అయితే ఈ సారి ఫ‌లితాలు గ్రేడ్‌ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు తెలిపారు.