AP TDP MLA Turns Paperboy: పేపర్‌బాయ్‌గా మారిన టీడీపీ ఎమ్మెల్యే

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేపర్‌బాయ్‌గా మారారు.

Published By: HashtagU Telugu Desk
Nimmala

Nimmala

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేపర్‌బాయ్‌గా మారారు. ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లు నియోజకవర్గంలోని మావుళ్లమ్మపేటకు వెళ్లి సైకిల్‌పై వార్తాపత్రికలను తీసుకెళ్లి 31వార్డులోని  తదితర ప్రాంతాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ‘గడప గడపకూ’ కార్యక్రమానికి కౌంటర్‌గా తాను పేపర్ బాయ్ గా అవతారమెత్తానని ఎమ్మెల్యే తెలిపారు. టిడ్కో ఇళ్లలో మిగిలిన 10% పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం ఏ విధంగా జాప్యం చేస్తుందో ప్రజలకు వివరించారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతినెలా నాలుగు రోజుల పాటు పేపర్‌బాయ్‌ గెటప్‌ వేస్తామన్నారు. నాలుగు రోజుల పాటు పారిశుధ్య పనులు చేపట్టి నిరసనలు తెలుపుతామన్నారు. అంతకుముందు కూడా ఎమ్మెల్యే రోడ్లపై గుంతల్లో చేపలు పట్టి వినూత్న నిరసనలు చేపట్టారు. పాలకొల్లులో పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్న షెడ్డును తొలగించడాన్ని నిరసిస్తూ రాత్రంతా షెడ్డు వద్దే గడిపారు.

  Last Updated: 01 Aug 2022, 09:18 PM IST