AP TDP: జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారు

  • Written By:
  • Updated On - June 27, 2024 / 10:06 PM IST

AP TDP: రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని సమాంతరంగా నడిపించగల నాయకులు నారా చంద్రబాబునాయుడు అని  తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మోటూరు నాగేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విజయభేరి సభలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడె ప్రసాద్ గారితో పాటు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడారు.

జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, జగన్ ఐదు సంవత్సరాల పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, మరలా తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే – రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడె ప్రసాద్ మాట్లాడారు.