Site icon HashtagU Telugu

AP SSC: పదో తరగతి ఫలితాలు వాయిదా!

TS SSC Result

Ssc

ఆంధప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు-2022 విడుదల వాయిదా పడింది. సోమవారం (జూన్‌ 6వ)తేదీకి ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం.. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శనివారం ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 2021-22 ఏడాదికిగానూ ఏప్రిల్ 27నుంచి మే 9వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.