Site icon HashtagU Telugu

AP Results 2024: ముద్రగడ ఇంటికి భారీగా పోలీసులు

AP Results 2024

AP Results 2024

AP Results 2024: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అయితే ఇది కేవలం ఆయనకు భద్రత కల్పించడమే కోసమేనని తెలుస్తుంది. ఈ మేరకు జగ్గంపేటలోని కిర్లంపూడిలో ఉన్న ఆయన ఇంటి చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. జనసేన నేతలు అయన ఇంటిని ముట్టడించవచ్చనే అనుమానంతోనే పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు.

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. 175 స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు తేలనుంది. వైసీపీ, టీడీపీ ప్రధాన పార్టీలుగా బరిలోకి దిగాయి. కూటమిలో భాగంగా జనసేన 21 సీట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. కాగా ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరనేది తేలనుంది.

Also Read: Surat : ఖాతా తెరిచిన ఎన్డీయే.. సూరత్‌ సీటును కైవసం!