Site icon HashtagU Telugu

AP Results 2024: 18 స్థానాల్లో జనసేన ఆధిక్యం

AP Results 2024

AP Results 2024

AP Results 2024: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గణనీయమైన ఆధిక్యాన్ని సంపాదించుకున్నారని తొలి నివేదికలు సూచిస్తున్నాయి.అటు ఎన్డీయే కూటమిలో భాగమైన జనసేన, బీజేపీ సైతం ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే టీడీపీ మ్యాజిక్ ఫిగర్ని దాటగా, జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో 18 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తుంది. ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దాదాపుగా 70 వేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Also Read: AP Politics : కౌంటింగ్‌ సెంటర్ల నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ