Site icon HashtagU Telugu

AP Train Accident: రేణిగుంట రైలు పట్టాలు తప్పింది.. బురదలోకి దిగింది!

Renigunta

Renigunta

రేణిగుంట తిరుచానూరు రైల్వే స్టేషన్ మధ్య గల CRS నందు రైల్వే ట్రాక్ నుంచి ట్రైన్ అదుపు తప్పింది. తిరుపతి నుండి రేణిగుంట రైల్వే స్టేషన్ కి వెళ్తున్న ట్రైన్ కు సిగ్నల్ ఇవ్వడంతో ఇంజన్ కి సిగ్నల్ ఇచ్చారని భావించిన లోకో పైలట్ ముందుకు పోనివ్వడంతో లూప్ లైన్ లో నిలిచి ఉన్న ఇంజన్ ముందుకు వెళ్లి బురదలో కూరుకుపోయింది.

ట్రైన్ ఇంజన్ అదుపుతప్పి రెండు అడుగుల మేర బురద లోకి దిగింది. ఈ ప్రమాదంతో రైల్వే ట్రాక్ విరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది ఇంజన్ కు మరమ్మతులు చేపట్టారు. ట్రైన్ రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలుగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న రైల్వే సిబ్బంది. ఎటువంటి నష్టం జరగపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.