Site icon HashtagU Telugu

Factory Closed: పోర‌స్ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్ర‌భుత్వం

fire

fire

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం గ్రామంలోని పోర‌స్ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. ఫ్యాక్ట‌రీని మూసివేస్తూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. బ‌ల్క్ డ్ర‌గ్ త‌యారీ ప‌రిశ్ర‌మ‌గా ఉన్న ఈ ఫ్యాక్ట‌రీలో ఏప్రిల్ 13న రాత్రి నైట్రో-ఎన్-మిథైల్ ఫాతాలిమైడ్‌ను తయారు చేస్తున్నప్పుడు రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అమలు చేయకపోవడం వల్ల పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 6 మంది కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

ఈ ఘ‌ట‌న‌తో పోరస్ లేబొరేటరీలకు విద్యుత్‌ను నిలిపివేసిన ఏపీపీసీబీ మూసివేయాల‌ని ఉత్తర్వులు జారీ చేసింది. అగ్ని ప్ర‌మాదంలో మరో 13 మంది గాయపడ్డారు. వీరంద‌రిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బ్లాక్‌లో 30 మంది పని చేస్తున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

Exit mobile version