Site icon HashtagU Telugu

AP : పవన్ కళ్యాణ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారా..?

AP Police stopped Pawan Kalyan after crossing Jaggayapet

AP Police stopped Pawan Kalyan after crossing Jaggayapet

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను అరెస్ట్ చేయడం ఏంటి..? అనుకుంటున్నారా.. ఉదయం నుండి ఏపీ పోలీసుల తీరు చూస్తే అలాగే అనుమానం వస్తుంది. ఏపీ మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను CID అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ పార్టీ అధినేత..40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని అర్ధరాత్రి హైడ్రామా నడుమ అరెస్ట్ చేసిన తీరు చూస్తే ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా..? అనే అనుమానం కలగక మానదు. చంద్రబాబు నే కాదు ఆయనకు మద్దతు తెలిపిన వారిని సైతం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ కే పరిమితం అయ్యారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలనీ లాయర్లు కోరుతున్నప్పటికీ..పోలీసులు మాత్రం విడుదల చేయడం లేదు.

ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీకి వస్తుండడం తో ఆయన్ను అడ్డుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు పవన్. రేపు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జనసేన పార్టీ సమావేశం ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈరోజు విజయవాడ కు రావాలని అనుకున్నారు. మధ్యాహ్నం విజయవాడ కు బయలు దేరిన పవన్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తో పరిస్థితి ఉద్రిక్తతగా మారిందని..ఈ సమయంలో అక్కడికి వెళ్తే అక్కడి పరిస్థితులు మరింత ఆందోళనకారణంగా మారతాయని చెప్పి…ఏపీ పోలీసులు ఎయిర్ పోర్ట్ పోలీసులకు సూచించడం తో అయ్యాను అడ్డుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన ఏపీకి బయలుదేరారు.

Read Also : AP : చంద్రబాబు అరెస్ట్ ఫై నోరుమెదపని జూ ఎన్టీఆర్..కళ్యాణ్ రామ్

పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఏపీ పోలీసులు జగ్గయ్య పేట వద్ద ఆయన కారు ను అడ్డుకున్నారు. అప్పటికే పవన్ కాన్వాయి వెంట జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు పవన్ అడ్డుకోవడం తో జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ ను పంపించకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో జగ్గయ్య పేట వద్ద ఆందోళన కారణంగా మారింది. మరి పవన్ ను వెనక్కు పంపిస్తారో..? లేక టీడీపీ నేతలను అరెస్ట్ చేసినట్లు చేస్తారో అనే టెన్షన్ వాతారణం నెలకొంది.