Site icon HashtagU Telugu

TDP: సారా ర‌గ‌డ‌.. టీడీపీ ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్..!

Tdp Mlas

Tdp Mlas

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను, ఆ రాష్ట్ర‌ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాల నేప‌ధ్యంలో ఎక్సైజ్ కార్యాలయం ముట్టడికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిని సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు టీడీపీ నేత‌ల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇటీవల జంగారెడ్డిగూడెంలో దాదాపు 25 మంది నాటుసారా తాగి మరణించారని టీడీపీ ఆరోపిస్తుంది.

అయితే మ‌రోవైపు అధికార వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం అవి సహజమరణాలేనని, కావాల‌నే టీడీపీ శ‌వ‌రాజ‌కీయాలు చేస్తుంద‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో ఈరోజు టీడీపీ విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం ముట్టడికి టీడీపీ పిలుపునిచ్చింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గద్దె రామ్మోహన్,అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, బొండా ఉమ తదితరులను ముంద‌స్తు జాగ్ర‌త్త‌లో భాగంగా టీడీపీ త‌మ్ముళ్ళ‌ను ఏపీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.