Loan: 2వేల కోట్ల అప్పు కోసం ఏపీ లాబీ

మరో రూ.2,000 కోట్ల రుణానికి ఏపీ ప్రతిపాదనలు తయారు చేసింది.

  • Written By:
  • Publish Date - February 5, 2022 / 10:32 AM IST

మరో రూ.2,000 కోట్ల రుణానికి ఏపీ ప్రతిపాదనలు తయారు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 20 ఏళ్ల కాలపరిమితికి రూ.వెయ్యి కోట్లు, 16 ఏళ్ల కాలపరిమితికి మరో రూ.వెయ్యి కోట్లు రుణం కావాలని.. వచ్చే మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ రుణం తీసుకునేందుకు ప్రతిపాదనలు పంపింది.రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్ల రుణం తీసుకునేందుకు పలురకాల షరతులు ఆర్బీఐ పెట్టనుంది.
రిజర్వుబ్యాంకు మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొనడానికి అర్హత కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
20 ఏళ్ల కాలపరిమితికి రూ.వెయ్యి కోట్లు, 16 ఏళ్ల కాలపరిమితికి మరో రూ.వెయ్యి కోట్లు రుణం కావాలని ప్రతిపాదన ను ఒకే చేయడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. సెక్యూరిటీల వేలంలో ఎంత వడ్డీకి ఈ రుణం దక్కుతుందో తేలుతుంది.కొత్త పీఆర్సీ జీతాలు, ఇతర అవసరాలు తీర్చడంతో రూ.2,400 కోట్ల వరకూ ఓవర్‌డ్రాఫ్టులో రాష్ట్రం ఉన్నట్లు ఆర్థికశాఖ నుంచి అందిన సమాచారం. వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓవర్‌ డ్రాఫ్టు వెసులుబాటు, మరికొన్ని నిధులు కలిపి ఇటీవల జీతాలు, పింఛన్లు చెల్లించినట్లు తెలిసింది. కొత్త రుణం కోసం 4 రోజుల్లో ఓడీ నుంచి బయటపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆర్థికశాఖ అధికారి ఒకరు ఢిల్లీ వెళ్లి రుణ ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఇంతవరకు చివరి త్రైమాసికానికి రుణ అనుమతులు లభించిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి రుణం ఇస్తారా? లేదా ?అనేది మంగళవారం తేలనుంది.