AP DGP: న‌యా డీజీపీ.. ఫ‌స్ట్ వార్నింగ్

  • Written By:
  • Updated On - February 19, 2022 / 04:15 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త డీజీపీగా ఈరోజు క‌సిరెడ్డి రాజేంద్ర నాథ్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మాజీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ నుంచి స్వీక‌రించిన రాజేంద్ర నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలు పోలీసులకు మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొనేలా చర్చలు తీసుకుంటామన్నారు. ఇక ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకునే విధంగా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని రాజేంద్ర నాథ్ రెడ్డి చెప్పారు.

పోలీసు స్టేషన్ లోప‌లికి దౌర్జన్యంగా ఎవరైనా ప్ర‌వేశించి పోలీసుల విధులను అడ్డుకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని రాజేంద్ర నాధ్ రెడ్డి హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా పోలీస్ వ్య‌వ‌స్థ ప‌నిచేసేలా చూస్తాన‌ని, త‌ప్పు చేసిన వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని రాజేంద్ర నాథ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏపీ చ‌ర్చ‌జ‌రుగుతోంది. మాజీ డీజీపీ స‌వాంగ్ఇ, జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కొమ్ము కాస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు నిత్య ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈక్ర‌మంలో కొత్త డీజీపీగా బాద్య‌త‌లు తీసుకున్న రాజేంధ్ర‌నాథ్ రెడ్డి ప‌నితీరు ఎలా ఉంటుందో చూడాలి. ఇక మరోవైపు ఈరోజు డీజీపీగా అద‌న‌పు బాధ్యతలను స్వీకరించిన రాజేంద్ర నాధ్ రెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్‌గా కూడా కొన‌సాగుతున్నారు.