Site icon HashtagU Telugu

AP Road Accident: మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డికి తప్పిన ప్రమాదం

Peddireddy Convoy

Convoy

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుంచి వీరబల్లిలోని అత్తగారి ఇంటికి వెళ్తున్న సమయంలో రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లోని ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన వాహనాన్ని మరో కారు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది.

దీంతో వాహనం పల్టీలు కొట్టగా.. వాహనంలో ప్రయాణిస్తున్న మిథున్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి , భద్రతా సిబ్బంది కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాయచోటి ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వాహనంలో ఉన్నారు. దీంతో ఎంపీ, మంత్రి పెద్దిరెడ్డి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఇద్దరు నేతలు క్షేమంగా బయటపడటంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.