Minister Ambati : టీడీపీ నేత‌ల‌పై మంత్రి అంబ‌టి రాంబాబు ఫైర్ .. వచ్చే ఎన్నికల్లో…?

ప్రభుత్వంపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న మంచి పనులను నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్లాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. నెలలో 20 రోజుల పాటు ప్రజల వద్దే ఉండి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని, పథకాలు లబ్ధిదారులకు చేరకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలని సీఎం జగన్ నాయకులను ఆదేశించారు. గడప గడపకూ […]

Published By: HashtagU Telugu Desk
Minister Ambati Rambabu

Minister Ambati Rambabu

ప్రభుత్వంపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న మంచి పనులను నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్లాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. నెలలో 20 రోజుల పాటు ప్రజల వద్దే ఉండి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని, పథకాలు లబ్ధిదారులకు చేరకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలని సీఎం జగన్ నాయకులను ఆదేశించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం అంటూ టీడీపీ విమర్శలు చేస్తోందని, సీఎం జగన్ పథకాలు, పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అంబ‌టి రాంబాబు అభిప్రాయపడ్డారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని, కోటి 50 లక్షల నిధులను నేరుగా ప్రజలకు అందజేశామని చెప్పారు. కుప్పంతోపాటు 175 ఎమ్మెల్యే స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుంద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు తెలిపారు.

  Last Updated: 08 Jun 2022, 04:40 PM IST