Home Minister Vanitha : డాగ్ స్క్వాడ్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న హోమంత్రి తానేటి వ‌నిత‌

మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో జరిగిన 20వ బ్యాచ్ డాగ్ స్క్వాడ్ పరేడ్ కార్యక్రమంలో హోమంత్రి...

Published By: HashtagU Telugu Desk
Taneti Vanitha AP home Minister

Taneti Vanitha AP home Minister

మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో జరిగిన 20వ బ్యాచ్ డాగ్ స్క్వాడ్ పరేడ్ కార్యక్రమంలో హోమంత్రి తానేటి వ‌నిత పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శిక్షణ పొందిన డాగ్ స్వ్కాడ్‌కు హోంమంత్రి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డాగ్ స్క్వాడ్‌లో ప్రస్తుతం 177 కుక్కలు ఉన్నాయని, వీటితో పాటు మరో 35 కుక్కలను చేర్చనున్నట్లు తెలిపారు. ఈ కుక్కల ఆరోగ్య సంరక్షణ కోసం పశువైద్య నిపుణులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆమె ప్రకటించారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ పూర్తి పారదర్శకంగా పనిచేస్తుంద‌ని హోమంత్రి తానేటి వనిత అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా, ఇంటెలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

  Last Updated: 28 Sep 2022, 11:50 AM IST