AP Home: వాళ్ల హాయాంలోనే అత్యాచారాలు ఎక్కువ

ఏపీలో జ‌రుగుతున్న వ‌రుస హ‌త్య‌లు, అత్యాచారాల‌పై హోంమంత్రి తానేటి వ‌నిత స్పందించారు.

  • Written By:
  • Updated On - May 5, 2022 / 05:48 PM IST

ఏపీలో జ‌రుగుతున్న వ‌రుస హ‌త్య‌లు, అత్యాచారాల‌పై హోంమంత్రి తానేటి వ‌నిత స్పందించారు. గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నాయకులు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మీద కావాలనే నిందలు వేస్తున్నారని ఆమె తెలిపారు. మహిళల భద్రత కోసం, వారి సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో హత్యలు,అత్యాచారాలు ఎక్కువ జరిగాయని… ఈ ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు బాగా తగ్గాయని ఆమె వెల్ల‌డించారు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక జీరో ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేశామ‌న్నారు. చంద్రబాబు మహిళల పై దాడులు జరుగుతున్న ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని…వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత మహిళల పై దాడులు తగ్గాయని ఆమె తెలిపారు.

పక్క రాష్ట్రం లో మహిళల పై అత్యచారం చేసి హత్య చేస్తే.. వేంటనే సీయం జగన్ స్పందించారని. .. ఆ స‌మ‌యంలోనే దిశ చట్టం చేశారని ఆమె గుర్తు చేశారు. ప్ర‌స్తుతం ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాసెస్ లో ఉందని.. మహిళలు ఎక్కుడ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు దిశ యాప్ ఎర్పాటు చేశామ‌ని హోమంత్రి తానేటి వ‌నిత తెలిపారు. జగన్ సీఎం అయిన త‌రువాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు లను ఎర్పాటు చేసి తప్పు చేసిన వారికి శిక్షడే విధంగా చర్యలు చేపట్టామ‌న్నారు. అందులో బాగానే గుంటూరు రమ్య హత్య కేసులో నిందితుడు కు శిక్ష పడింద‌ని.. రమ్య కుటుంబానికి ఒక కోటి రూపాయల పై ఖర్చు చేసి ఐదు ఎకరాల పొలం కొనుగోలు చేసి ఇచ్చామ‌న్నారు. కొన్ని కేసులలో తండ్రి కుమార్తె ల పై హత్య చారాలు చేసిన ఘటనలు ఉన్నాయని… అందులో భాగంగా నే తాను తల్లి లే ఆడపిల్లలకు రక్షణ గా ఉండాల‌ని మాట్లాడానని ఆమె తెలిపారు.