Site icon HashtagU Telugu

Bigg Boss Show: బిగ్ బాస్ వంటి షోలలో ఏదైనా ప్రదర్శిస్తామంటే సహించబోమన్న హైకోర్టు

Biggboss Imresizer

Biggboss Imresizer

రియాల్టీ షోల పేరుతో ఏది పడితే అది ప్రదర్శిస్తామంటే ఎలా అని ఎవరైనా ప్రశ్నిస్తే.. నువ్వు అప్ డేట్ అవ్వలేదు అని అవతలి నుంచి సెటైర్ వస్తుంది. అశ్లీల దృశ్యాలు, ద్వంద్వార్థాలు వచ్చేలా డైలాగులు.. పిచ్చి వేషాలు.. ఇవన్నీ చూసి ఇవేం రియాల్టీ షోలరా బాబు.. ఇంట్లో ఫ్యామిలీతో చూడలేకపోతున్నాం అని చాలామంది ఆవేదన చెందుతున్నారు. టీవీ కాని, మొబైల్ కాని ఓపెన్ చేయాలంటేనే భయపడుతున్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే ప్రశ్న వేసింది. రియాల్టి షోల పేరుతో ఏది పడితే అది ప్రదర్శిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించింది.

రియాల్టీ షోల విషయంలో కళ్లు మూసుకుని ఉండలేమన్న హైకోర్టు మాటలను బట్టి అది ఈ షోల విషయంలో ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి షోలలో హింసను ప్రోత్సహించి అది కల్చర్ అంటే ఎలా అని ప్రశ్నించింది. నిజానికి బిగ్ బాస్ షో, అశ్లీలతను ప్రోత్సహించేదిలా ఉందంటూ.. తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై
అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరపున న్యాయవాది ఈమధ్యనే కోరడంతో ధర్మాసనం అంగీకరించింది.

ఈ కేసు విషయంలో సీనియర్ న్యాయవాది స్పందిస్తూ.. ఇది 2019లో దాఖలైన వ్యాజ్యమని.. పిటిషనర్ తరపున న్యాయవాది.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ముందుకు దీనిని తీసుకువచ్చారని.. అత్యవసర విచారణ జరిపించాలన్నారు. కానీ అందుకు సీజే బెంచ్ఒ ప్పకోలేదన్నారు. పిటిషనర్ కూడా తాను సీజే బెంచ్ ను ఆశ్రయించానన్నారు. దీంతో సీజే బెంచ్ వద్ద అత్యవసర విచారణను కోరే అవకాశాన్ని పిటిషనర్ కే వదిలేసింది ధర్మాసనం.

బిగ్ బాస్ వంటి షోలు ఎలాంటి సెన్సార్ షిప్ లేకుండా ప్రసారమవుతున్నాయి. దీనివల్ల వాటిలో చూపించే అశ్లీల, అసభ్య దృశ్యాలు, డబుల్ మీనింగ్ డైలాగులు అన్నీ అలాగే జనాలకు చేరుతున్నాయి. దీంతో యువత పెడదారి పట్టే అవకాశముందన్న విమర్శలు ఉన్నాయి.

Exit mobile version