AP High Court: అమ‌రావ‌తి ప‌నుల‌పై స్టేట‌స్ రిపోర్ట్ ఇవ్వండి

రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నులు చేప‌ట్టాల‌ని గ‌తంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమ‌లు చేయ‌క‌పోడవంపై రైతులు మ‌రోసారి కోర్టును ఆశ్ర‌యించారు.

  • Written By:
  • Updated On - May 5, 2022 / 03:08 PM IST

రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌నులు చేప‌ట్టాల‌ని గ‌తంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమ‌లు చేయ‌క‌పోడవంపై రైతులు మ‌రోసారి కోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌ను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతులు వేసిన పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే ఇప్పటి వరకు జరిగిన అమరావతి పునుల్లో జరిగిన పురోగతిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది.

ఉద్దేశపూర్వకంగానే తీర్పును అమలు చేయట్లేదని రైతులు పిటీషన్ లో పేర్కొన్నారు. నిధులు లేవనే సాకుతో రాజధాని తీర్పు అమలులో జాప్యం చేస్తున్నారని రైతుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. అమరావతిపై స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది.