Site icon HashtagU Telugu

AP Capital: ఏపీ ప్ర‌భుత్వానికి బిగ్ షాక్‌.. రాజ‌ధానిపై తీర్పు ఇచ్చిన హైకోర్టు

అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వానికి హైకోర్టులో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. రాజ‌ధాని మార్పు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ రైతులు హైకోర్టుని ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్ల‌పై ఈరోజు హైకోర్టు త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం తీర్పు ఇచ్చింది. సీఆర్డీఏ చట్టానికి అనుగుణంగా రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదేన‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆరునెలల్లో రాజధానిలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది రాజధాని రైతులకు మూడు నెలల్లో ఫ్లాట్ ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. రాజ‌ధానిలో జ‌రుగుతున్న అభివృద్ధిని ఎప్ప‌టిక‌ప్పుడు హైకోర్టుకు తెల‌పాల‌ని ఆదేశించింది. రాజ‌ధాని భూముల‌ను ఇత‌ర అవ‌స‌రాల‌కు వాడుకోవ‌ద్ద‌ని హైకోర్టు తీర్పులో ప్ర‌స్తావించింది. హైకోర్టు తీర్పుతో రాజ‌ధాని రైతులు ఆనందం వ్య‌క్తం చేశారు.