AP TDP: ఐదు సంవత్సరాలుగా ఏపీ అన్ని రంగాల్లో వెనకబడి ఉంది : బాబు రాజేంద్రప్రసాద్

  • Written By:
  • Publish Date - May 26, 2024 / 07:42 PM IST

AP TDP: ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని కోరుకున్నానని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు. కలియుగ దైవం శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి, మంచి రోజులు రావాలని ఆయన తెలిపారు.

గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడి ఉందని, బిడ్డల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా జూన్ 9 తారీఖున ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన కోరుకున్నారు. ఆయన వెంట సింగంశెట్టి సుబ్బరామయ్య, చుక్క ధనుంజయ్ యాదవ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.