AP Pension : వృద్ధుల‌కు శివ‌రాత్రి ఫించ‌న్‌

శివ‌రాత్రి సంద‌ర్భంగా వృద్ధుల‌కు ఆల‌స్యం లేకుండా పింఛ‌ను పంపిణీ చేసేలా ఏపీ సీఎం జ‌గ‌న్ ఆదేశించాడు.

  • Written By:
  • Updated On - March 1, 2022 / 04:33 PM IST

శివ‌రాత్రి సంద‌ర్భంగా వృద్ధుల‌కు ఆల‌స్యం లేకుండా పింఛ‌ను పంపిణీ చేసేలా ఏపీ సీఎం జ‌గ‌న్ ఆదేశించాడు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి నెలలో వృద్ధులకు వృద్ధాప్య పింఛను పంపిణీ వేగంగా జ‌రిగింది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి 61,25,228 మంది లబ్ధిదారులకు ఫించ‌న్ అందిస్తున్నారు. ఫిబ్రవరి పింఛన్‌ పంపిణీకి రూ.1,557.06 కోట్లు జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కి విడుద‌ల చేశాడు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో పింఛన్‌ నిధుల జమ ప్రక్రియ పూర్తయినట్లు సెర్ప్‌ అధికారులు తెలిపారు. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తారు. ఐదు రోజుల పాటు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా లబ్ధిదారులకు పింఛన్‌ చెల్లింపునకు బయోమెట్రిక్‌, ఐరిస్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. RBIS పాలసీ కూడా అందుబాటులోకి వచ్చింది. సాంకేతిక కారణాలతో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. కాగా, పింఛన్ల పంపిణీని పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని డీఆర్‌డీఏ కార్యాలయాల్లో కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.