Site icon HashtagU Telugu

AP Assembly Sessions : జూన్‌ 20 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు..?

AP ASSEMBLY

AP ASSEMBLY

ఏపీలో జూన్ 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ నెల 20 నుంచి వారం రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మార్పు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేయనున్నారని, కొత్త స్పీకర్‌గా కోలగట్ల వీరభద్ర స్వామి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. సోమవారం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్, సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు, తదితర అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. కోనసీమలో జరుగుతున్న ఆందోళనలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ల‌