Site icon HashtagU Telugu

AP Employees: ఏపీ ఉద్యోగుల సమ్మె విరమణ

Jagan Victory

Jagan AP employees

మంత్రులు, పీఆర్సీ సాధన సమితి నాయకుల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఉద్యోగులు సమ్మెను విరమించారు. సచివాలయ ఉద్యోగులు విజయం సాధించారు. వాళ్ళు అనుకున్న విధంగా బెనిఫిట్స్ పొందారు. మిగిలిన ఉద్యోగులు కొందరు ఇంకా అసంతృప్తి గా ఉన్నపటికీ సమ్మెను విరమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యధాతధంగా విధులకు హాజరు కానున్నారు. ఆ మేరకు మీడియా ముందుకొచ్చిన సజ్జల, ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా వెల్లడించారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఉద్యోగ సంఘాల నేతలు, సజ్జల ప్రెస్ మీట్ లో ఇలా చెప్పారు…
ప్రతి అంశంపై లోతుగా చర్చించి అందరి ఆమోదం వచ్చిందని సజ్జల చెప్పారు. హెచ్ ఆర్ ఏ విషయంలో వివిధ స్లాబ్స్ ఉద్యోగులతో చర్చించి పెంచినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో 16 శాతం నిర్ణయించామని,హెచ్ఓడీ, సెక్రటేరియట్ వారికి జూన్ 2024 వరకు 24 శాతం హెచ్ఆర్ఏ ఉంటుంది. మారిన హెచ్ ఆర్ ఏ జనవరి 2022 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసినా ప్రదర్శనలు చేసినా ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగానే ఉన్నామని తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వల్ల ఉన్నంతలో బెటర్ ప్యాకేజ్ ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని చెప్తున్నారు

ఫైనల్ డీల్ కుదిరింది ఇలా.
…..
►ఫిట్ మెంట్ 23 శాతం అదే కొనసాగుతుంది

►అడిషనల్ క్వాంటం 70-74 వయసు వాళ్ళకు 7 శాతం

►ఐఆర్ రికవరీ ఉపసంహరించుకుంటున్నాం

►పదేళ్లకో సారి కాకుండా 5 ఏళ్లకే పీఆర్సీ అమలు చేయాలని నిర్ణయించాం

►సీపీఎస్ రద్దు ప్రక్రియ మార్చ్ 21 కల్లా రూట్ మ్యాప్ తయారు అవుతుంది

►గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల కన్ఫర్మేషన్ జూన్ లోపు జరగాలి

►యధావిధిగా ఉద్యోగులు బాద్యతల్లోకి వెళ్తారని భావిస్తున్నాం

Exit mobile version