Site icon HashtagU Telugu

AP Formation Day: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆవిర్భావ దినోత్స‌వం.. పొట్టి శ్రీరాముల‌కు నివాళ్లర్పించిన సీఎం జ‌గ‌న్‌

Ap Emergency

Cm Jagan

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పొట్టి శ్రీరాములుకు సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు . తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ, పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టి అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి మనిషికి అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజాకేంద్రీకృత విధానాన్ని కొనసాగించాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఏ ప్రభుత్వమైనా విజయానికి ప్రజల ఆనందమే బారోమీటర్ అని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాలు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ తెలిపారు.

Exit mobile version