Site icon HashtagU Telugu

AP Govt : పాత, కొత్త మంత్రులతో ‘తేనీటి విందు’

Jagan mohan reddy

Jagan mohan reddy

ఒక్క ఛాన్స్ అంటూ ఏపీలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రెండేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ, మార్పులు ఉంటాయని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందరూ అనుకున్నట్టు మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ మేరకు మంత్రులు రాజీనామా చేయడం, ముఖ్యమంత్రి జగన్ ఆమోదించడం, ఆ తర్వాత గవర్నర్ కు పంపడం చకచకా జరిగిపోయాయి. అయితే కొత్త మంత్రివర్గం రూపుద్దిద్దుకుంటున్న నేపథ్యంలో ఈనెల 11 న పాత, కొత్త మంత్రులతో సీఎం జగన్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు ఉంటుందని సీఎంవో వర్గాలు స్పష్టం చేశాయి. మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు పంపామని, Aa, A1, A2, B1, b2 కేటగిరీలుగా పాసులు జారీ చేశామని ఏపీ సీఎంవో ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేసింది.