Site icon HashtagU Telugu

AP Governor : లతా మంగేష్కర్ మృతి పట్ల ఏపీ గ‌వ‌ర్న‌ర్ సంతాపం

Latha Mangeshkar

Latha Mangeshkar

ప్రముఖ గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ఆసుపత్రిలో మంగేష్కర్ కన్నుమూశారు. లతా మంగేష్కర్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ క్వీన్ ఆఫ్ మెలోడీ, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందారని గవర్నర్ హరిచందన్ అన్నారు. సంగీత ప్రపంచంలో ఆమె మరణంతో ఏర్పడిన శూన్యాన్ని ఎప్పటికీ పూడ్చలేమని, సంగీత ప్రపంచానికి ఆమె చేసిన కృషిని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటాయని గవర్నర్ అన్నారు. లతా మాంగేష్కర్ కుటుంబ సభ్యులకు గవర్నర్ హరిచందన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.