CM Jagan : పేదల పెన్షన్‌ రూ.5 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం

  • Written By:
  • Publish Date - March 2, 2024 / 10:23 AM IST

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.

అమరావతి రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన, భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని పెంచుతూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. గతంలో రూ.2500 వేల చొప్పున పెన్షన్‌ అందిస్తుండగా.. ఆ మొత్తాన్ని రూ. 5 వేలకు పెంచుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇటీవల గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పింఛన్ మొత్తాన్ని పెంచుతామని, వచ్చే నెల నుంచి ఇది అమలు చేస్తామంటూ సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలోనే సీఎం వైఎస్‌ జగన్ ఇచ్చిన మాట మేరకు ఏపీ ప్రభుత్వం వారికి పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

అయితే.. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పింఛన్ల పెంపు విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్ దృష్టికి తీసుకురావడంతో సానుకూలంగా స్పందించిన సీఎం.. వీరికి అందించే పింఛన్ మొత్తాన్ని రూ.2,500 నుంచి రూ. 5వేలకు పెంచాలంటూ అధికారులకు ఆదేశించారు.

గతంలో సాధారణ పెన్షన్లు రూ. వెయ్యి ఉన్న సమయంలో అమరావతి ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన వారికి రూ.2.500 పెన్షన్లు ఇచ్చేవారని జగన్ గుర్తు చేశారు. వైసీపీ హయాంలో వృద్ధాప్య, వితంతు పింఛన్లను రూ.3 వేలకు పెంచామని తెలిపిన వైఎస్ జగన్.. రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన వారికి కూడా పింఛన్ మొత్తాన్ని పెంచుతామని సభావేదికగా ప్రకటించారు.