Site icon HashtagU Telugu

AP Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కొన్నింటిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Veligonda Imresizer

Veligonda Imresizer

ఏపీలో వెలిగొండ ప్రాజెక్టు సుదీర్ఘకాలంగా నిర్మాణంలో ఉంది. తాజాగా, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కొన్నింటిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తీగలేరు బ్రాంచ్ కెనాల్లో కొన్ని పనులను తొలగిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 60-సి కింద డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పనులను తొలగిస్తున్నట్టు వివరించింది.

అలాగే తీగలేరు సప్లయి చానల్ కు సంబంధించి మిగతా రూ.84 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఈ పనులకు కొత్తగా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

తీగలేరు సప్లయి చానల్ ద్వారా 11,500 ఎకరాలకు నీరందించే వెసులుబాటు ఉంది. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా తీగలేరు పనులు కూడా జరుగుతున్నాయి.