Site icon HashtagU Telugu

Teenage Vaccine: టీనేజర్ల వ్యాక్సిన్ పై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

టీనేజర్లకి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూస్టర్ డోసు,15-18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ విడుదల చేసింది. 15-18 ఏళ్లు దాటిన వారికి జనవరి ఒకటి నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు వయసు గల వారికి 2022 జనవరి 3 నుంచి వాక్సినేషన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 10వ తేదీ నుంచి రెండో డోసు వేసుకొని 9 నెలలు పూర్తయిన హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు, హెల్త్ వర్కర్స్, రెండు డోసులు పూర్తయిన వారికి  డాక్టర్ల సూచనల మేరకు జనవరి 10వ తేదీ నుంచి  బూస్టర్ డోసు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు  అన్ని జిల్లాల కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు,వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version