AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటిపై నిషేధం

ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. గుంటూరు, కందుకూరు ఘటనలతో ప్రజల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ, కేంద్ర, మున్సిపల్, పంచాయతీ రాజ్ రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - January 3, 2023 / 08:41 AM IST

ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. గుంటూరు, కందుకూరు ఘటనలతో ప్రజల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ, కేంద్ర, మున్సిపల్, పంచాయతీ రాజ్ రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

కందుకూరు, గుంటూరు తొక్కిసలాటతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్‌, పంచాయితీరాజ్‌ రోడ్లపై ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. రేర్‌ కేస్‌లలో SP, పోలీస్‌ కమిషనర్ అనుమతితో సభలు సమావేశాలు పెట్టుకోవచ్చని సూచిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీష్‌‌కుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.