Game Changer: హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగనున్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రానున్నారు. అయితే ఈ మూవీ విడుదలకు ముందే గేమ్ ఛేంజర్‌కు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
సినిమా విడుదల రోజు అంటే జనవరి 10వ తేదీన 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే టికెట్ ధరల పెంపునకు కూడా అనుమతినిచ్చింది. జనవరి 10వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత బెనిఫిట్ షో టికెట్‌పై రూ. 600 వరకు పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. మిగతా ఐదు షోలకు మాత్రం కండీషన్లు పెట్టింది. మిగతా 5 షోలకు మల్లీపెక్స్‌లో రూ. 175, సింగిల్ స్క్రీన్‌లపై రూ. 135 పెంచుకోవచ్చని ప్రకటించింది. 23వ తేదీ వరకు రోజుకూ ఐదు షోలకు పాటు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read: Telangana Jobs : కోర్టుల్లో 1673 జాబ్స్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారికి ఛాన్స్
సినిమాపై విపరీతమైన బజ్
జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న గేమ్ ఛేంజర్ మూవీపై మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా డైరెక్టర్ శంకర్ తెలుగులో మొదటి సినిమా కావడంతో మూవీ ఎలా ఉంటుందా అని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే గేమ్ ఛేంజర్ మూవీ సినిమాపై విపరీతమైన బజ్‌ను పెంచింది. ఈ ట్రైలర్‌తో పాటు సినిమాలోని పాటలు, స్టోరీ లైన్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ, అంజలి నటించారు. వీరితో పాటు ప్రముఖ నటులు శ్రీకాంత్, సముద్రఖని, ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, అలీ, బ్రహ్మానందం, సునీల్, జయరామ్, తదితరులు ఈ సినిమాలో యాక్ట్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.