Site icon HashtagU Telugu

AP Ganesh Mandaps: వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము లేదు. కమిషనర్ హరి జవహర్ లాల్

Ganesh

Ganesh

వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని ధార్మిక శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాలకు ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. మండపాల ఏర్పాటుకు చట్టపరంగా అనుమతులు ఏమైనా ఉంటే స్థానిక రెవెన్యూ, పోలీసు శాఖలను సంప్రదించాలన్నారు.
ఫీజు వసూలు చేస్తున్నట్లు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.