Site icon HashtagU Telugu

Andhra Pradesh : అంగ‌న్‌వాడీల‌పై ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌.. విధుల్లో చేర‌కుంటే..?

Anganwadi Workers

Anganwadi Workers

అంగన్‌వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. సమ్మె పేరుతో విధుల కానీ వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ నెల 5వ తేదీ లోపు విధులకు హాజరుకాకుంటే యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. విధులకు హాజరుకానీ అంగన్‌వాడీల వివరాలు సేకరించాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంపై అంగన్‌వాడీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జీతాలు పెంచాలంటూ గత 20 రోజులుగా అంగన్‌వాడీలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అంగన్‌వాడీలు ప్రభుత్వంతో ఓసారి చర్చలు జరపగా.. అవి విఫలం అయ్యాయి. అంగన్వాడీలు మళ్లీ సమ్మె బాటపట్టారు. దీంతో రాష్ట్రంలోని బాలింతలు, గర్బిణీలు, శిశువులు ఇబ్బంది పడుతున్నారని.. దీంతో విధులకు హాజరుకావాలని ప్రభుత్వం ఇవాళ అల్టిమేటం జారీ చేసింది.

Also Read:  Nara Bhuvaneswari : రేపటి నుండి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటన