Elephants Attack: కుప్పంలో ఏనుగుల భీభత్సం.. రైతుపై దాడి

ఏపీలో అటవీ జంతువులు కలకలం రేపుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లోకి వస్తూ జనాలను ముపుతిప్పలు పెడుతున్నాయి.

  • Written By:
  • Updated On - September 19, 2022 / 12:26 PM IST

ఏపీలో అటవీ జంతువులు కలకలం రేపుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లోకి వస్తూ జనాలను ముపుతిప్పలు పెడుతున్నాయి. కేవలం సంచారంతో ఆగిపోకుండానే దాడి చేస్తున్న ఘటనలు భయాందోళనకు గరిచేస్తున్నాయి. రోజురోజుకూ ఏనుగులు భీభత్సానికి అడవి ఏనుగుల గుంపు దాడి చేయడంతో ఓ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటన చిత్తూరులోని కుప్పంలో చోటుచేసుకుంది. కుప్పం మండలం గణేష్ నగర్‌లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.

వన్యప్రాణుల నుంచి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నించిన రైతు రామస్వామిపై ఏనుగుల గుంపు దాడి చేసిన సంగతి తెలిసిందే. అతనికి తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఏనుగులు తరచూ బీభత్సం సృష్టించి ప్రజలపై దాడి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా ఫారెస్టు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని కుప్పం ప్రజలు వేడుకుంటున్నారు.