Site icon HashtagU Telugu

PRC Issue: పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని రోడెక్కిన సంఘాలు!

Ap Employess

Ap Employess

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్లమీదికొచ్చాయి. “పే రివర్సల్” అని పేర్కొంటూ వేతన సవరణపై ప్రభుత్వ ఉత్తర్వులను పూర్తిగా తిరస్కరించారు. తమ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు త్వరలో సమ్మె చేస్తామని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం వెంటనే స్పదించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ధర్నాలు చేస్తామని తేల్చిచెప్పారు. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు రోడ్ల మీద భైఠాయించడంతో వాహానాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.