Site icon HashtagU Telugu

Chalo Vijayawada : ఉద్యోగుల ఛలో విజయవాడ వాయిదా

AP employees

AP employees

ఏపీ ఉద్యోగులు సెప్టెంబ‌ర్ 1న త‌ల‌పెట్టిన ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్లు సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు తెలిపాయి. రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్న దృష్ట్యా 11వ తేదీకి చలో విజయవాడ కార్యక్రమం వాయిదా వేసినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. నోటీసులు, బైండోవర్లు వంటి చర్యలతో ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు.