ఏపీలో ఉద్యోగులు ఈ రోజు నుంచే బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయాలి. ఉద్యోగులు సకాలంలో కార్యాలయాలకు వచ్చేలా బయోమెట్రిక్, ఆన్ లైన్ అటెండెన్సును పక్కాగా అమలు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బయోమెట్రిక్, ఆన్ లైన్ అటెండెన్సు పక్కాగావేస్తే తప్పా నెలాఖరుకి జీతబత్యాలు వచ్చే పరిస్థితితి లేదని తేల్చి చెప్పింది. అందుకోసం సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్నిశాఖలకు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో ఏ ఒక్కప్రభుత్వశాఖకు వెసులుబాటు లేదని, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే సమయంలో అధికారులతోపాటు, ఉద్యోగులూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా కార్యాలయాల పనివేళల్లో ప్రజలు ఏ పనిపై వచ్చినా వారికి సిబ్బంది అందుబాటులో ఉండి వారి పనులు సత్వరమే చేస్తారనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
Andhrapradesh : యాప్ ద్వారా హాజరు ఈ రోజు నుంచే.. బయోమెట్రిక్ పడితేనే..?

Ap Employees 1 Imresizer