Site icon HashtagU Telugu

AP Election Results : ఫ్యాన్‌ను బండకేసి బాదిన టీడీపీ నేతలు

Tdp Celebrations

Tdp Celebrations

వైఎస్సార్‌సీపీ 2019 రికార్డును బద్దలు కొడుతుందని, జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ రోజున యావత్ దేశం ఆంధ్రప్రదేశ్‌ని చూస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ప్రకటించారు. సీఎం ప్రకటన పార్టీ క్యాడర్‌లో కొత్త ‘జోష్’ నింపినప్పటికీ, ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. అయితే.. ఆరంభం నుంచే టీడీపీ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే టీడీపీ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటి 100కు పైచిలుకు స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. అంతేకాకుండా.. టీడీపీ కూటమి అభ్యర్థులు మొత్తంగా.. దాదాపు 153 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ కూటమి విజయం దాదాపు ఖరారు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలు సంబరాలు అంబరాన్నంటాయి. టీడీపీ జెండాలు పట్టుకొని డ్యాన్స్‌లు వేస్తూ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. బాణసంచాలు కాలుస్తూ.. సంబరాలు జరుపుకుంటున్నారు.

అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఐదేళ్ల పాటు నియంత పాలనగా సాగిన వైసీపీ అధికారం నుంచి దిగిపోతుందన్న సంతోషంలో.. ఆ పార్టీ గుర్తు.. ఫ్యాన్‌ను రోడ్డుకేసి కొడుతూ… టీడీపీ జెండాలను ఎగురవేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తమతమ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అయితే.. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ 20 వేల పైచిలుకు మెజారిటీతో కొనసాగుతున్నారు. జనసైనికులు సైతం సంబరాల్లో మునిగిపోయారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత వైసీపీ పరిస్థితి ఏంటా అని అందరూ చర్చించుకుంటున్నారు.

Read Also : TG LS Polls : తెలంగాణలో 7 స్థానాల్లో బీజేపీ ముందంజ..