Site icon HashtagU Telugu

AP DGP: ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి

Apdgp

Apdgp

మియావకి విధానం ద్వారా ‘డెవలప్ మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్’ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మంగళగిరి 6th బెటాలియన్ లో మొక్క నాటి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బెటాలియన్ల ప్రాంగణం లో అటవీశాఖ అధికారుల చేత అనువైన ప్రదేశాన్ని గుర్తించి భూసార పరీక్షలు నిర్వహించిన  అనంతరం మియావకి విధానం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం ఎనిమిది బెటాలియన్ లలోని 15.35 ఎకరాల విస్తరణలో అటవీశాఖ ద్వారా సేకరించిన 19,774 మొక్కలను నాటే విధంగా  కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఇది ఒక కొత్త ఆలోచన అని, బెటాలియన్ల లోని ప్రాంగణం తో పాటు ఇతర అనువైన ఖాళీ ప్రదేశాలలో ఈ మియావకి విధానం ద్వారా ఫారెస్టు అభివృద్ధి చేయవచ్చు అని అన్నారు. చాలామందికి మన పర్యావరణం కాపాడుకోవాలని ఉంటుంది కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి..?  ఏ విధంగా చేయాలి అనే ఆలోచన దగ్గర ఆగిపోతూ ఉంటారని, ఒక యాక్షన్ ప్లాన్ గా ఈ విధానం పనిచేస్తుందని డీజేపీ అన్నారు

Exit mobile version