Site icon HashtagU Telugu

TDP MP: ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం : రామ్మోహన్ నాయుడు

Rammohan Naidu

Rammohan Naidu

TDP MP: కేంద్ర కేబినెట్లో చేరడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ‘ఏపీ అభివృద్ధే మాకు ముఖ్యం. చాలా సమయం తర్వాత TDPకి కేంద్రమంత్రి పదవి దక్కింది. కేంద్రంతో సఖ్యతే మాకు ముఖ్యం. మా మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి చర్చలు జరిపిన తర్వాతే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటాం. రిజర్వేషన్ల అంశంలో మా ఆలోచనలో మార్పు లేదు’ అని స్పష్టం చేశారు.

కింజరపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పరిచయం అక్కర్లేని పేరు. టీడీపీ ఎంపీగా శ్రీకాకుళం నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టిన రామ్మోహన్ నాయుడు ఈసారి అంతకు మించిన భారీ అవకాశాన్ని అందుకున్నారు. అదే కేంద్ర క్యాబినెట్ లో మంత్రి పదవి. ఎస్. మోదీ 3.0 క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు రాము. ఎన్డీయే కూటమి లో బీజేపీ తర్వాత అత్యధిక ఎంపిక స్థానాలున్న టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. అందులో ఒకటి కేంద్ర మంత్రి పదవి కాగా మరొకటి కేంద్ర సహాయమంత్రి. కేంద్ర మంత్రి పదవి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు దక్కితే…సహాయమంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ దక్కించుకున్నారు.