AP : ఈసీ ఎదుట హాజరైన ఏపీ సీఎస్, డీజీపీ

పోలింగ్ రోజు మాత్రమే కాదు ఆ తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో వీటి ఫై వివరణ ఇవ్వాలని ఈసీ ఏపీ సీఎస్, డీజీపీ లకు ఆదేశాలు జారీ చేయడం తో కొద్దీ సేపటి క్రితం ఢిల్లీ లోని ఈసీ ఆఫీస్ కు చేరుకున్నారు

  • Written By:
  • Publish Date - May 16, 2024 / 05:10 PM IST

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఢిల్లీలోని ఈసీ ఎదుట హాజరయ్యారు. తాజాగా జరిగిన ఏపీ పోలింగ్ లో పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పోలింగ్ రోజు మాత్రమే కాదు ఆ తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో వీటి ఫై వివరణ ఇవ్వాలని ఈసీ ఏపీ సీఎస్, డీజీపీ లకు ఆదేశాలు జారీ చేయడం తో కొద్దీ సేపటి క్రితం ఢిల్లీ లోని ఈసీ ఆఫీస్ కు చేరుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో హింస చెలరేగడంపై ఆగ్రహంగా ఉన్న ఈసీ.. దీన్ని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారని అధికారుల్ని ఇప్పటికే ప్రశ్నించింది. దీంతో నిఘా వైఫల్యంపైనా ఈసీ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసను అరికట్టే విషయంలో నిఘా వైఫల్యమే కారణమని సీఎస్, డీజీపీ ఈసీకి వివరించే అవకాశం ఉంది. అలాగే పల్నాడు జిల్లా ఎస్పీని ఈ మధ్యే ఈసీ మార్చింది. అలాగే జిల్లా ఎస్పీలను ఈసీ మార్చిన చోటే హింస చెలరేగినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇదే వాదనను సీఎస్, డీజీపీ ఈసీకి వినిపించే అవకాశముంది. మరి ఈసీకి వారు ఎలాంటి సమాదానాలు చెపుతారో..వాటికీ ఈసీ శాంతిస్తుందా ..లేక ఏమైనా సీరియస్ అవుతుందా అనేది చూడాలి.

Read Also : Salaar 2 : ప్రభాస్ ‘సలార్ 2’లోకి మరో మలయాళ స్టార్ నటుడు ఎంట్రీ.. ఏ పాత్ర కోసం..?