Site icon HashtagU Telugu

CM Jagan Kuppam Tour : చంద్రబాబు ఇలాకాలో సీఎం జ‌గ‌న్‌.. నేడు వైఎస్సార్ చేయూత నిధులు విడుద‌ల‌

Check your Vote

Jagan chandrababu naidu

ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఇలాకాలో ప‌ర్య‌టించ‌నున్నారు. సీఎం జ‌గ‌న్ కుప్పం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. లబ్దిదారులకు మూడో విడత వైఎస్సార్ చేయూత నిధులను జగన్ విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం అయిన తర్వత తొలిసారిగా జ‌గ‌న్ కుప్పం వెళ్తుండ‌టంతో రాజ‌కీయం వెడెక్కింది. ఈ సారి కుప్పంలో చంద్రబాబుని ఓడించాల‌ని వైసీపీ అధిష్టానం పావులు క‌దుపుతుంది. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. సీఎం జ‌గ‌న్ స‌భ‌లో కుప్పంకు ఎలాంటి నిధులు ప్ర‌క‌టిస్తార‌నే ఉత్కంఠ నెల‌కొంది.సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కుప్పం నిండా వైసీపీ జెండాలు, సీఎం కటౌట్లు, బ్యానర్లే కనిపిస్తున్నాయి.