YS Jagan : జ‌గ‌న్ క‌డ‌ప టూర్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు వైఎస్సార్ క‌డ‌ప జిల్లాకు వెళుతున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మనవడి వివాహానికి హాజరవుతారు. అనంతరం పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.

Published By: HashtagU Telugu Desk

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు వైఎస్సార్ క‌డ‌ప జిల్లాకు వెళుతున్నారు. ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి మనవడి వివాహానికి హాజరవుతారు. అనంతరం పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.
జగన్ పర్యటన షెడ్యూల్ వివరాలు:
శుక్ర‌వారం ఉదయం తాడేప‌ల్లి నివాసం నుంచి 9.50 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
అక్కడి నుంచి విమానంలో బయల్దేరి 10.40 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
10.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయల్దేరి 11 గంటలకు ప్రొద్దుటూరుకు వెళ‌తారు
11.25 గంటల నుంచి 11.40 వరకు తిరుపాల్ రెడ్డి మనవడి వివాహ వేడుకలో పాల్గొంటారు.
అనంతరం అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.10 గంటలకు పులివెందుల హెలిప్యాడ్ కు చేరుకుంటారు.
12.20 గంటలకు పులివెందుల గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు.
12.30 నుంచి 4.00 గంటల వరకు నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమవుతారు.
సాయంత్రం 4.40 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి గన్నవరం చేరుకుంటారు.
సాయంత్రం 5.45 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి తిరిగి చేరుకుంటారు.

  Last Updated: 16 Jun 2022, 03:59 PM IST