Site icon HashtagU Telugu

AP CM: మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాధ్యమవుతోంది!

Jagan Homes

Jagan Homes

రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు(ఎంఐజీ)’లకు ప్రభత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిలకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని జగన్ రెడ్డి అన్నారు. ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని, ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. ఈ టౌన్ కాలనీల వల్ల మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని, 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అవకాశం ఉందని, తొలిదశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి,  కందుకూరు, కావలి, ఏలూరులో ప్లాట్ల కేటాయింపు ఉంటుంది సీఎం పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్‌షిప్‌లు ఏర్పాటు సిద్ధం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెల్లడించారు.